
జనం న్యూస్ జనవరి 24 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలంలోని గల ప్రైవేటు పాఠశాలల్లో బాల్య వివాహాల చట్టం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం లో బాగంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ (జగిత్యాల) రత్న పద్మావతి ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ (జగిత్యాల) అర్ లావణ్య జూనియర్ సివిల్ జడ్జ్(కోరుట్ల) కే పావని గారు కలిసి బీర్పూర్ లో గల ప్రైవేట్ పాఠశాలలో దాదాపు 300 మంది విద్యార్థులకు బాల్య వివాహ చట్టం గూర్చి, పోషకాహారం, రుతు సంబంధ శుభ్రత, విద్య యొక్క ప్రాధాన్యత, ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవడం గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గూర్చి మరియు కొత్త వాళ్ళతో ఎలా ఉండాలి, ఏదైనా తప్పు జరిగినప్పుడు తల్లిదండ్రులకు, టీచర్లకు తెలియజేయాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించి జడ్జిలు అర్.లావణ్య, కే పావని మరియు బీర్పూర్ సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ రాజు, స్కూల్ యాజమాన్యం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.