
జనం న్యూస్ 25 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రతి పాఠశాల యందు ప్రభుత్వ కార్యాలయంలో పెట్టుట తప్పనిసరి చేయాలి జిల్లా కలెక్టర్ సంతోష్ కి వినతి పత్రం ఇచ్చిన భీమ్ ఆర్మీ నాయకులు భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాష్ భీమ్ ఆర్మీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మేళ్లచెరువు వర్షిత్ జోగులాంబ గద్వాల జిల్లాలో జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ప్రతి పాఠశాల యందు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో భారత రాజ్యాంగాన్ని ప్రదర్శించాలి మరియు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ చిత్రపటాన్ని తప్పనిసరి పెట్టుట చేయాలనీ భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ మాచర్ల ప్రకాష్ జిల్లా అధ్యక్షులు వర్షిత్ జిల్లా కలెక్టర్ సంతోష్ ని వినతిపత్రం అందజేశారు సందర్భంగా జిల్లా కలెక్టర్ తప్పనిసరిగా చర్య తీసుకుంటామని అన్నారు