
జనంన్యూస్. 25.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల పరిది లొని సర్పంచ్ తండా లో. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సర్పంచ్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మలావత్ శోభ జీవన్ నాయక్ , ఉప సర్పంచ్ బాదావత్ గేని రామ్ చందర్ మరియు వీడీసీ చైర్మన్ సరియా నాయక్ ఆధ్వర్యంలో వాలీబాల్ గేమ్‌ను ఘనంగా ప్రారంభించారు..ఈ సందర్భంగా సర్పంచ్ తండా సర్పంచ్ శోభా జీవన్ మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని తెలిపారు. గ్రామంలో క్రీడల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.