
బిచ్కుంద జనవరి 25 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణపు స్థలం మంజూరికై ప్రభుత్వము ద్వారా రెండు ఎకరాల భూమిని కేటాయించిన సందర్భంగా బిచ్కుంద మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్పల్లి సంతోష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో తోట లక్ష్మీకాంతరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు . ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షునితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగనాథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ పత్తి లింగరం సోఫాన్ సార్ బాలకృష్ణ సాయిని అశోక్ గోపనపల్లి శ్రీనివాస్ పుల్కల్ మున్నూరు కాపు సభ్యులు ధర్పల్లి సంజు చింతల హనుమాన్లు గంగాధర్ బిచ్కుంద మండలం మున్నూరు కాపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
