
జనంన్యూస్. 26.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు. రాజస్థాన్ శిక్షా సమితి (హరిచరణ్ మార్వాడి స్కూలు) నూతన అధ్యక్షులుగా వల్లబ్ సారడాఎన్నికయ్యారు. శనివారం రాత్రి బస్టాండ్ ప్రక్కన గల హరిచరన్ మర్వాడి స్కూలులో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు,హరిచరణ్ శిక్షా ట్రస్ట్ ఛైర్మెన్ ప్రేమాలతా అగర్వాల్ హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులచే ఆమె ప్రమాణ స్వీకారం చేయించాడు. ఈ సందర్భంగా ప్రేమలతా అగర్వాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విద్య అందించాలని,విద్యాభివృద్ధికి నూతన కమిటి పని చేయాలని ఇందుకు తన వంతు సహాకారాన్ని అందిస్తానని అన్నారు. రాజస్థాన్ శిక్షా సమితి కి మంచి పేరు ఉందని మరింతగా విద్యా వ్యాప్తికి నూతన కమిటీ పని చేయాలని కోరారు.భవిష్యతులో ఆధునిక నూతన,శాస్త్రీయ విద్యా విధానాలను ప్రవేశపెట్టాలని సూచించారు. రాజస్థాన్ శిక్షా సమతి ఆధ్వర్యంలో విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా తన పూర్తి సమయాన్ని కేటాయించి కృషి చేస్తానని నూతన అధ్యక్షులు వల్లభ్ సారడా హామి ఇచ్చారు.నూతన కమిటీ..
రాభస్థాన్ శిక్షా సమితి నూతన కమిటి అధక్షులుగా వల్లభ్ సారడా, ఉపాధ్యక్షులు గా నరేష్ తివారీ,సెక్రటరీగా జితేందర్ మాలినీ, జాయింట్ సెక్రటరీ గా రాజేదపాండే, కోశాధికారి గా శ్రీకాంత్ జవర్ లతో పాటు 15 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.
