
జనం న్యూస్ 26 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహర్నిశలు కృషి చేసి భారతదేశానికి దిక్సూచి అయినటువంటి భారత రాజ్యాంగాన్ని బహుమతిగా ఇచ్చిన అట్టి రాజ్యాంగం అమలులోకి వచ్చి 77 సంవత్సరాల అయిన సందర్భంగా భారతదేశం మొత్తం గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బి సి మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన 50% రిజర్వేషన్లు అనుభవిస్తూ అభివృద్ధి చెందినటువంటి ప్రతి పౌరుడు అలాగే 50% జనరల్ కోటాలో రిజర్వేషన్. అనుభవిస్తున్నటువంటి అన్ని కులాల ప్రజలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్లనే అని గ్రహించి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని అట్టి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి జెండావిష్కరణ చేయవలసిందిగా పిలుపునిస్తూ మాల శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ ఐక్య వేదిక కన్వీనర్ జోగులాంబ గద్వాల జిల్లా