
జనం న్యూస్ జనవరి 26 | తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్: శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి పరిధిలోని రామకృష్ణ నగర్లో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా వందన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి, కార్యదర్శి ఆర్. రామచంద్రరావు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి సీఐ కేవీ సుబ్బారావు, ఎస్సై చంద్రశేఖర్ హాజరై జెండా వందన కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ తరఫున ముఖ్య అతిథులకు శాలువాలతో సత్కారం నిర్వహించారు.
అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ, “మా కాలనీలో ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని కాలనీవాసులు, కమిటీ సభ్యుల సమక్షంలో ఐక్యతతో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. జాతీయ పండుగలు మనలో దేశభక్తిని, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయి” అని అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న కాలనీవాసులకు సీఐ కేవీ సుబ్బారావు స్వీట్లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో కమిటీ సభ్యులు ఎస్. శ్రీధర్ రావు, జి. ప్రసాద్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తం, నరేందర్ రెడ్డి, శ్రీనివాసరావు, సుధాకర్, కిషోర్, సునీల్ పటేల్, వెంకటేశ్వరరావు, రాఘవేందర్, సూర్యనారాయణ, కేవీ రావు తదితరులు పాల్గొన్నారు.చివరగా కార్యక్రమంలో పాల్గొన్న కాలనీవాసులందరికీ, ముఖ్య అతిథులకు అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి, కార్యదర్శి ఆర్. రామచంద్రరావు పేరుపేరునా కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
