
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్, భూదేవి హిల్స్ కాలనీలో బిజెపి యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ స్థానికులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరాంకితం అవ్వాలని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరుని మీద ఉన్నది అన్నారు, భారతీయులుగా జాతీయ ఏకత్వం, దేశ సేవ పట్ల మన అంకితభావాన్ని మరింత బలపరుచుకొని దేశ సమైక్యతలో, జాతి నిర్మాణంలో భాగస్వాములం అవ్వాలని అన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు, కాలనీవాసులు, యువత, మహిళలు పాల్గొన్నారు.
