
జనం న్యూస్ జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోనకు చెందిన ప్రముఖ సినీ కళాకారుడు “పుష్ప “ సురేష్ శర్మ ఆల్ ఇన్ వన్ టాలెంట్ కేటగిరిలో బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ నిర్వహించిన అవార్డులలో భాగంగా
సురేష్ శర్మ కు ఈ పురస్కారం దక్కింది . హైదరాబాద్ సత్యసాయి నిగమామగమ్ లో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న నిష్ణాతులకు రుద్ర ఫౌండేషన్ అవార్డులు అందజేసింది. ప్రముఖ సినీ నటుడు సమీర్ ఈ పురస్కారాన్ని సురేష్ శర్మ కు బంగారు నంది అవార్డు అందజేయడంతో పాటు ఘనంగా సత్కరించారు . అందజేసారు . రేడియో , టీవి , సినీ , డబ్బింగ్ కళారంగాలతో పాటు ఫోటోగ్రఫీలో ప్రతిభ చూపిన పుష్ప సురేష్ శర్మను ఈ యేడాది ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ చైర్మన్ పి. భూలక్ష్మీ తెలిపారు . ఈ సందర్భంగా బంగారు నందితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసారు . గత నాలుగు దశాబ్దాలుగా కళారంగాన్నే నమ్ముకున్న తనకు రుద్ర ఫౌండేషన్ అందించిన పురస్కారం మరువలేనిదని పుష్ప సురేష్ శర్మ అన్నారు . ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసరావు,కార్యదర్శి అరుణ కుమారి , డిప్యూటి కమీషనర్ రామదాసు పలువురు టీవీ సిని కళాకారులు , రాజకీయ నాయకులు ॥అధికారులు పాల్గొన్నారు .