
సార్వ భూమిక దేశం మన భారతదేశం - ప్రిన్సిపాల్ శివకుమార్
జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ హిల్ కాలనీ మెయిన్ బజార్ స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ ఏ శివకుమార్. కరస్పాండెంట్ నకులరావు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రిన్సిపాల్ ఏ శివకుమార్ మాట్లాడుతూ 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందించాలనే సంకల్పంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని అట్టి రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని, విద్యార్థి దశ నుంచే దేశభక్తిని, క్రమశిక్షణను అలవర్చుకోవాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.