
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 26 సెల్ 9550978955
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట పట్టణం బిజెపి కార్యాలయం ఎన్నార్టీ సెంటర్ అటల్ బీహార్ వాజ్పేయి విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చిలకలూరిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులకు నియోజకవర్గ ప్రజలకు మరియు కార్యకర్తలకు అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహనీయులు అందించిన ఈ రాజ్యాంగం వల్ల భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. సామాన్యుడికి సైతం సమాన హక్కులు లభిస్తున్నాయని, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని ఆయన పేర్కొన్నారు.బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశించే సామాజిక మార్పు, పారదర్శక రాజకీయాల కోసమే తాము నిరంతరం శ్రమిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈ సందర్భంగావెల్లడించారు.దేశాభివృద్ధిలో యువత చురుగ్గా పాల్గొనాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు."భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కులను అనుభవిస్తూనే, బాధ్యతగల పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడమే మనం దేశానికి ఇచ్చే గొప్ప గౌరవం.అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల సేవ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కిసాన్ మార్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు కోటా పవన్ కుమార్ గాంధీ, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వంశీ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సుభాని, పట్టణ మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ, బీజేవైఎం నాయకులు తెల్లబాటి మనోహర్పట్టణ కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ, రాయుడు, బిజెపి సీనియర్ నాయకులు ఉప్పాల భాస్కరరావు కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు