
జనం న్యూస్ 27 జనవరి ఘట్ కేసర్ ప్రతినిధి
ఉప్పల్ జోన్, ఘట్కేసర్ సర్కిల్, కేంద్రంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైనింగ్ ఎం.ఎస్.ఎం న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఎదులాబాద్ డివిజన్ పరిధి లోని లింగాపురంలో నివసించే ఎస్సి మహిళలకు నిర్వహిస్తున్న జూట్ బ్యాగుల శిక్షణ కేంద్రం వద్ద, భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గెస్ట్ ఫ్యాకల్టీ స్వరూపరాణి, మాధురి నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రధాన జ్యూట్ బ్యాగుల శిక్షణ ఉపాధ్యాయురాలు జె.ఎస్.ఎస్ బోర్డు మెంబెర్ బి.వరలక్ష్మి , ఘట్ కేసర్ లోని జ్యూట్ బ్యాగుల శిక్షణ కేంద్రంవద్ద మువ్వన్నెల పతకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం శిక్షణ పొందుతున్న మహిళలు ఉత్సాహంగా పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించి, భారతావనికి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలను ఉద్దేశించి నిర్వాహకులు మాట్లాడుతూ మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే పరిమితం కాకుండా, ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సి మహిళల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న ఈ ఉచిత జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణను ఒక గొప్ప అవకాశం గా భావించి, ఉపాధి మార్గాలను మెరుగుపరుచుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ 77వ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ..మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న మహిళలు భవాని, సునీత, శిరీష, సుమతి, హేమలత, లక్ష్మి, స్వప్న, రేణుక, సౌమ్య, శిరీష, మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
