జనం న్యూస్ ఫిబ్రవరి 07(నడిగూడెం). మండలం లోని కరివిరాల గ్రామానికి చెందిన షేక్ సిద్దయ్య (65) భార్య రంజాన్భి ఆధార్ కార్డు లో వయస్సు తక్కువ గా నమోదు చేయడం తో ఆయనకు పింఛన్ కు అర్హత లేకపోవడం తో పాటు నివాసం ఉండటానికి ఇల్లు లేకపోవడం ఆ బాధలు చాలనట్లు కూలికి వెళ్ళడానికి కూడ ఆరోగ్యం సహకరించక పోవడంతో ఒక పూట తింటూ మరో పూట పస్తులు ఉంటున్నారనే విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త గార్లపాటి మహేష్ రెడ్డి,గత మూడు సంవత్సరాలుగా ప్రతి నెల 2000 రుపాయలు ఇస్తూ ఆ వృద్ధ దంపతులకు ఉడతా భక్తి గా సాయం చేస్తూ ఇప్పటి వరకు ఆ కుటుంబానికి 72000 సహాయం చేయడం తో పాటు కంటి సమస్య తో బాధపడుతున్న సిద్దయ్య కు సూర్యాపేట లో కన్ను ఆపరేషన్ చేయించి అండగా నిలిచాడు. అంతేకాకుండా వారికి ప్రభుత్వ పింఛన్ వచ్చే వరకు ప్రతి నెల రూ 2000 ఇస్తూ ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా అందుకుంటానని హామీ ఇచ్చారు. మహేష్ రెడ్డి ని గ్రామంలో పెద్దలు,పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కేశ గాని భద్రయ్య, గోపి,సంతోష్,ఉపేందర్,శశిధర్ రెడ్డి,రహీం సాహెబ్ పాల్గొన్నారు.