
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలోని పదవ వార్డులో ముస్లిం మైనారిటీ పెద్దల సూచన మేరకు జండా మాను వీధి బోర్డు ఏర్పాటు చేసినట్లు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ తెలిపారు. జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ కార్యదర్శి సయ్యద్ అమీర్ ఆధ్వర్యంలో ముస్లిం యువత సోమవారం ఏర్పాటు చేసిన జండా మాను వీధి ఫలకాన్ని సర్పంచ్ సూర్య నారాయణ ప్రారంభించారు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని జండా మాను వీధిగా పిలవడం జరుగుతుందని అని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతానికి జండా మాను వీధి బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ను సత్కరించారు ఈ కార్య క్రమంలో వార్డు సభ్యులు ముస్లిం మైనార్టీ నాయకులు యువకులు పాల్గొన్నారు