
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 27
జహీరాబాద్ మల్చల్మ గ్రామంలో మెథడిస్ట్ చర్చ్ యవనస్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మెథడిస్ట్ చర్చ్ పాస్టర్ యం సునీల్ పాల్గొని ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి దేశం కొరకు రాజుల కొరకు నాయకుల కొరకు ప్రజలందరికీ భగవంతుడు చల్లగా దీవించాలని ప్రార్థించి జెండాను ఎగరవేయడం జరిగింది, పాస్టర్ సునీల్ మాట్లాడుతూ
మన దేశంలో కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ ఈ గణతంత్ర దినోత్సవం ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలం, వారి సుదీర్ఘ పోరాటం ద్వారా వచ్చిన స్వాతంత్ర్య ఫలాలను పరిపాలనలో అమలు చేయాల్సిన బాధ్యతలు, విధులను తెలిపే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు.దిశానిర్దేశం చేయడానికి రచించిన రాజ్యాంగం అత్యంత విలువైనది. ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగం మూలం. మనదేశం భిన్నత్వంలో ఏకత్వం కలది.వివిద వర్గాల వారు వారి విశ్వాసాలకు అనుగుణంగా భగవద్గీత, ఖురాన్, బైబిల్ ను గౌరవిస్తారు,కాని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు గౌరవించేది దేశ రాజ్యాంగాన్ని,దేశాన్ని అభివృద్ధి పధంలో నడపడానికి అందరూ కృషి చేయాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాండురంగ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సరిత రాని,పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, మెథడిస్ట్ చర్చ్ సంఘస్తులు,యువకులు, గ్రామ ప్రజలు, పాల్గొనడం జరిగింది.