
అనకాపల్లి ఉత్సవ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన స్పీకర్
జనం న్యూస్,జనవరి 27,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా
అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పర్యటించారు.అనకాపల్లి ఉత్సవాలు సందర్భంగా ఆవ వద్ద జరిగిన ఏర్పాట్లు గురించి స్పీకర్ కి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ పునర్వనంలో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు భారీ వృక్షాన్ని నాటారు. అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణలో తొలగించిన భారీ వృక్షాలను క్రేన్ సహాయంతో ఆవ వద్దకు తరలించారు.ఈ నెల 30,31 తేదీల్లో జరిగే అనకాపల్లి ఉత్సవ్ ను విజయవంతం చేయాలని స్పీకర్ అయ్యన్న పిలుపునిచ్చారు.భారీ వృక్షాలకు తిరిగి ప్రాణం పోస్తున్న ఎమ్మెల్యే సుందరపుని అయ్యన్న అభినందించారు.
గతంలో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన తనకు ఇలా భారీ వృక్షాన్ని నాటడం చాలా సంతోషాన్నిచ్చిందన్న స్పీకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
