
జనం న్యూస్ జనవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లిలో ఈ నెల 31న శనివారం జరిగే గవరపాలెం గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావు నాయుడు పిలుపునిచ్చారు. చిన్న నాలుగు రోజుల జంక్షన్ జంక్షన్ లోని ప్రైవేట్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఉత్సవం లో దాదాపు 35 స్టేజి ప్రోగ్రాములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. ఈ సందర్భంగా గడచిన 26వ తేదీన ఇప్పటికే పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు.. 600 మంది యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవడం జరిగిందన్నారు. బుధవారం పెద్ద ఎత్తున అమ్మవారికి సారే ఊరేగింపు కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించడం జరుగుతుందన్నారు .29న గురువారం పెద్ద ఎత్తున కిమ్స్ ఐకాన్ వారిచే మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు.. మనోహర్ నాయుడు విగ్రహం వద్ద శుక్రవారం తీర్థం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అలాగే 31న గౌరీ పరమేశ్వరల ఉత్సవం సందర్భంగా శనివారం పరమేశ్వరి పార్క్ జంక్షన్లో ఉత్తరాంధ్ర స్థాయి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే రోజు రాత్రి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు జాతర నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మెయిన్ రోడ్ లోనే రింగ్ రోడ్ జంక్షన్లో భారీ ఎత్తున బాణాసంచా కాల్చడం జరుగుతుందన్నారు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జానపద నృత్యాలు నేల వేషాలతో అమ్మవారిని తాళమేళాలతో ఊరేగించడం జరుగుతుందన్నారు..భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఐదు రోజులు పాటు జరిగే ఉత్సవాలను తిలకించి జయప్రదం చేయాలని అప్పారావు నాయుడు కోరారు. అనంతరం ఉత్సవ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కొణతాల మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొణతాల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి లుపివి రమణ, దాడి కృష్ణ, పీవీ సత్యనారాయణ, సూరిశెట్టి నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు