
జనం న్యూస్, జనవరి 27,అచ్యుతాపురం:
జనవరి 29 గురువారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సిజిఆర్ఎఫ్ అనగా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక అచ్యుతాపురం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ఉపకేంద్రం వద్ద విద్యుత్ సమస్యలపై పరిష్కార వేదిక జరుపబడుతుందని అచ్యుతాపురం మండలానికి సంబందించిన విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సమస్యలపై ఎటువంటి సమస్యలు ఉన్న ఫిర్యాదులు తీసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరింపబడునని, ప్రజలు వీటిపై స్పందించి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్,ఏఈ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.