
జనం న్యూస్ జనవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
గొలగాం పంచాయతీ తలారి వారి పాలెం ఎస్సీ కాలనీలో వెలసిన యల్లారమ్మ జాతర మహోత్సవం అట్టహాసంగా జరుపుకుంటున్నారు. అనకాపల్లి మండల జనసేన నాయకులు గొర్లి ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం నకు భక్తులు తెల్లవారు అయిదు గంటలు నుండి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని తమ కోర్కెలను తీర్చుకున్నారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి హోమం జరిపించామని అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం కోలాటం, నూకాంబిక వారిచే తీన్మార్ ప్రోగ్రాం, డాన్స్ బేబీ డాన్స్ కోలాటం చిటికెలు భజనలు మరియు భక్తులకు ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమం రాత్రి కి భారీ భాణసంచా కార్యక్రమం జరుగుతుందని గొర్లి ప్రసాద్ తెలిపారు.