
బిచ్కుంద జనవరి 28 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో ఐ క్యు ఏసి మరియు కెరీర్ గైడెన్స్ ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్ చేత బాలికల కొరకు ప్రత్యేక ఉదోగ్య నైపుణ్య శిక్షణ కార్యక్రమం వారం రోజులపాటు కొనసాగుతాయని శిక్షణ అనంతరం శిక్షణలో పాల్గొన్న విద్యార్థినిలకు సర్టిఫికెట్ కూడా ప్రధానం చేయడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. రిసోర్స్ పర్సన్ గా డాక్టర్ చిరంజీవి మరియు భవాని గార్లు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.జి.వెంకటేశం అకాడమీ కోఆర్డినేటర్ డా . టి. హన్మండ్లు, ఐక్యూఎసి కోఆర్డినేటర్ డా. జి. రమేష్ బాబు, మహిళా సాధికారత సమన్వయకర్త వై. రేవతి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు
