
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955
ప్రభుత్వం ద్వారా స్థానిక సమస్యలు పరిష్కారం చేసేందుకు నవతరం పార్టీ చేపట్టిన ప్రజావారధి కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుంది అని జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ వద్ద చేపట్టిన కార్యక్రమంలో స్థానికులు పలు సమస్యలు వివరించారు.మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని వారికి తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం గ్రీవెన్స్ పెండింగ్ లేకుండా చేస్తుందని తెలిపారు. బుధవారం నాడు దుగ్గిరాల మండల కేంద్రంలో వినతి పత్రాలు స్వీకరిస్తామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ రజాక్ పాల్గొన్నారు.