
జనం న్యూస్: జనవరి 28 ( రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)
ట్రేడింగ్ మీద అవగాహన లేక భర్త జేడీ లక్ష్మీనారాయణ సహాయం తీసుకొని రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న ఊర్మిళ.
ఊర్మిళ వాట్సప్ నంబరుకు గత ఏడాది నవంబర్ నెలలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఒక లింక్ వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే 500 రెట్లు ఆదాయం వస్తుందని ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు.ట్రేడింగ్ మీద అవగాహన లేకపోవడంతో భర్త జేడీ లక్ష్మీనారాయణ సహాయం తీసుకుని పెట్టుబడి పెట్టింది.డిసెంబర్ 24 నుండి జనవరి 5 వరకు 19 విడతలుగా రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టించి 2 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లుగా నమ్మించారు.విత్ డ్రా చేసుకోవాలంటే మరికొంత సొమ్ము చెల్లించాలని చెప్పడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నేరానికి పాల్పడ్డ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన నలుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.