
జనం న్యూస్ నందలూరుకడప జిల్లా.
నందలూరుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అనుపల్లి పుల్లయ్య తనయుడు అయినటువంటి అనుపల్లి వరప్రసాద్ కి ప్రతిష్టాత్మక గురు రత్నటీచర్స్అవార్డ్స్–2026లోఉత్తమ సామాజిక సేవా పురస్కారం లభించింది.ఈ అవార్డును డా. జె. రామ చంద్రన్ మారిటైమ్ ఫౌండేషన్ మరియు ఏఎమ్ఈటీ విశ్వ విద్యాలయం (AMET University) సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో చెన్నైలో ప్రదానం చేశారు. విద్యతో పాటు సామాజిక బాధ్యత, సమాజ అభివృద్ధి రంగాల్లో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు.ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులైన ఉపాధ్యా యులను గౌరవించేందుకు నిర్వహించ బడింది. కార్య క్రమంలో పలువురు విద్యా వేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు.వరప్రసాద్ కి లభించిన ఈ గౌరవం విద్యారంగంలో సేవాభావంతో పనిచేస్తున్న ఉపాధ్యా యులకు ప్రేరణగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
