
జనం న్యూస్ 29 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ ఉప సంచాలకులు దున్న రమేష్ తండ్రి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీహరి (92) సోమవారం విశాఖ, మధురవాడలోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యలతో శివైక్యం చెందారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండల కేంద్రానికి చెందిన వీరు ఉపాధ్యాయునిగా విధుల్లో చేరి సుదీర్ఘ కాలం విద్యాశాఖలో విశేష సేవలు అందించారు.దున్న రమేష్ గతంలో శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా సేవలందించిన నేపథ్యంలో, వారి తండ్రి మరణవార్త తెలుసుకున్న పలువురు అధికారులు తమ ప్రగాఢ వ్యక్తం చేశారు. శ్రీహరి మృతి పట్ల శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కె. చెన్నకేశవరావు, వారి కార్యాలయ సిబ్బంది సంతాపం ప్రకటిస్తూ శ్రీహరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు అదపాక సత్యారావు, విశ్రాంత జిల్లా విద్యాశాఖ అధికారి బలివాడ మల్లేశ్వర రావు ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శోకతప్త హృదయంతో ఉన్న వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.