
జనం న్యూస్ 29 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
జిల్లా పోలీస్ కార్యాలయ హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు నివాసాలపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
విజయనగరం, గుర్ల, విశాఖలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీలో 15 ఏళ్లు పని చేసిన సమయంలో అవినీతి అధికారులకు సమాచారం ఇచ్చి, సుమారు రూ.20 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు చేపట్టారు. ఏడాది క్రితం ఈయనను జిల్లా పోలీస్ కార్యాలయానికి సరండర్ చేశారు.