
జనం న్యూస్: జనవరి 30 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్
నిడమానూరు మండల రైతులకు వ్యవసాయ శాఖ ద్వార సబ్సిడీ పై బ్యాటరీ పంపులు మరియు పెట్రోల్ పంపులు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి మునికృష్ణయ్య తెలిపారు. ఇట్టి అవకాశాన్ని మండలంలోని రైతులందరూ ఉపయోగించుకొన వలసిందిగా కోరుతూ, రైతులు వ్యవసాయ అధికారి కార్యాలయము నిడమనూరు నందు దరఖాస్తు చేయవలసిందిగా తెలిపారు.