
జనం న్యూస్ జనవరి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం పరకాల మండలం తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం షాదీ ముబారక్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, విదేశీ విద్యానిధి, మైనారిటీ యువతకు సబ్సిడీపై రుణాల మంజూరు,మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు దుస్తుల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందులు, మసీదులలో పనిచేసే ఇమామ్, మౌజన్ లకు ప్రతి నెల గౌరవ వేతనం ,వక్ఫ్ ఆస్తుల రక్షణ, మరమ్మతుల కోసం ప్రత్యేక గ్రాంట్-ఇన్-ఏడ్ వంటి ప్రత్యేక పథకాలను అమలు చేశారు. ఈ పథకాల ద్వారా ముస్లింల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలను గుర్తించి డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖను అప్పగించారని, ఇది ముస్లింలకు దక్కిన గౌరవమన్నారు.మైనారిటీల కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, విద్య, ఉపాధి కల్పనలో పేద ముస్లిం కుటుంబాలకు భరోసా కల్పించారని, మైనారిటీలు బి.ఆర్.ఎస్ వెంటే ఉన్నారని ఫాతిమా హమీద్ పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిన ఎన్నికల సమయంలో ప్రకటించిన ముస్లిం డిక్లరేషన్ నేటి వరకు అమలు చేయకపోవడంతో ముస్లింలపై కాంగ్రెస్ కు ఉన్న చిత్తశుద్ధి ఏంటో తేలిపోయింది.వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు…..