
జనం న్యూస్ జనవరి 29 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి పి విట్టల్,మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ ప్రవీణ్ గ్రామ సర్పంచ్ అనిల్ ,ఉప సర్పంచ్ శ్రీరాములు ,వార్డ్ మెంబర్లు ,గ్రామస్తులు హాజరై, క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ స్థాయిలోని ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు ముందుండాలని సూచించారు.ఈ క్రీడోత్సవాల్లో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, వంటి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మండలంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల అభివృద్ధి పరిషత్ అధికారి ప్రవీణ్ , మండల విద్యాధికారి విట్టల్, సర్పంచ్ అనిల్ ఉప సర్పంచ్ శ్రీరాములు ,అధికారులు, పీఈటీలు, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.