
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 29 సెల్ 9550978955
నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.
చిలకలూరిపేట పట్టణ పరిధిలోని గౌడపాలెం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం ను నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం సందర్శించి సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబుకి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.ఆసుపత్రికి చెందిన టాయిలెట్ ను స్టోర్ రూమ్ గా వాడటం, ల్యాబ్ సౌకర్యం సరిగ్గా లేకపోవడం, స్టోర్ రూమ్ సమస్య,అంబులెన్సు దారి లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.కమిషనర్ స్పందించి ఒకసారి ఆసుపత్రి పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.Dmho రవికి తెలిపేందుకు ప్రయత్నం చేయగా ఫోన్ కాన్ఫరెన్స్ లో ఉన్న అయన అందుబాటులోకి రాలేదు.డాక్టర్ జతిన్ ద్వారా వివరాలు తెలుసుకుని స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి సమస్యలు తీసుకువెళ్తామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. పేదలకు వైద్యం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి అధికారులు గమనించి తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు. పోలీస్ శాఖ తరపున అంబులెన్సు దారి కోసం పట్టణ సీఐ పి రమేష్ బాబు కూడా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.