
బిచ్కుంద జనవరి 29 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంబిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేసినారు.బిచ్కుంద పట్టణ పరిధిలోని వివిధ మార్గాలలో వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు,వ్యాపారస్తులు, ప్రయాణికులు వ్యక్తిగతంగా 50 వేల కన్నా ఎక్కువ డబ్బులు దగ్గర ఉంచుకోవద్దని తెలిపారు.ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరమైనచో తీసుకు వెళ్లేటప్పుడు సంబంధిత డబ్బులకు సంబంధించిన రిసిప్ట్ కాపీలు తదితర పత్రాలు దగ్గర ఉంచుకోవాలని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రాము, కృష్ణ తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ జీవయ్య ,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
