
బిచ్కుంద జనవరి 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు రెండో రోజు జోరుగా కొనసాగింది. బిజెపి, బి ఆర్ ఎస్ కాంగ్రెస్,స్వతంత్ర అభ్యర్థులు వార్డుల వారిగా సభ్యులు నామినేషన్లు దాఖలు చేసినారు. మొత్తం రెండో రోజు 34 నామినేషన్లు దాఖలు అయినవి మొదటి రోజు మూడు మొత్తం 37 మంది ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేసినారు. రేపు చివరి రోజు కావడంతో ఆశావహులు పార్టీల టికెట్ ఆశించిన వారు జోరుగా నామినేషన్లు వేస్తారని చర్చించుకుంటున్నారు.నామినేషన్ల కేంద్రాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ పరిశీలించినారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ని, రిటర్నింగ్ అధికారులను సూచనలు సలహాలు ఇచ్చినారు.వీరి వెంట ఎమ్మార్వో వేణుగోపాల్ డిప్యూటీ ఎమ్మార్వో భరత్ ఎన్నికల సిబ్బంది, ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

