
జనం న్యూస్ జనవరి(30) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ
కేంద్రంలో శనివారం నాడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో సిట్ విచారణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసు ఇవ్వడాని నిరసిస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి దహనం చేసినాడు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఇచ్చిన రెండు సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో హరీష్ రావు,కేటీఆర్,సంతోష్ లతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని వేధించడని తీవ్రంగా ఖండించినారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశాడు. అధికారం రావడానికి ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేయాలని చేశాడు. ఈ కార్యక్రమంలో గుండగాని రాములు గౌడ్,మట్టి పెళ్లి శ్రీశైలం, దొంగరీ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి,మనోజ్,రమేష్, కరుణాకర్,రాములు,వీరయ్య రమేష్,సోమేశ్,సాయిలు తదితరులు పాల్గొన్నారు.