
జనం న్యూస్, జనవరి 30,అచ్యుతాపురం:
అనకాపల్లి ఉత్సవాలు 2026 లో భాగంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ వద్ద ఘనంగా ప్రారంభం అయ్యాయి.అనకాపల్లి ఉత్సవాలను జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రారంభించారు.అనంతరం కొండకర్ల ఆవలో బోట్ షికారులో మంత్రి కొల్లు రవీంద్ర,స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాకి ప్రతీక ఏటికొప్పాక కొయ్య బొమ్మల తయారీని విధానాన్ని ముఖ్య అతిథులు పరిశీలించారు.ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కూడా అతిధులు సందర్శించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సిఎం రమేష్,జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్,ఎస్ పి తుహిన్ సిన్హా, శాసనసభ్యులు సుందరపు విజయ కుమార్, పంచకర్ల రమేష్ బాబు, కార్పొరేషన్ చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్య బాబు, మల్ల సురేంద్ర, బాలాజీ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.