
జనం న్యూస్ 31 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
తిరుపతి లడ్డు ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, దీనిపై చంద్రబాబు నాయుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సిట్ నివేదికతో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు అబద్ధమని స్పష్టమైందన్నారు. రాజకీయ లాభాల కోసం దేవుని పేరుతో రాజకీయం చేయడం తగదని విమర్శించారు.