
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జనవరి 31
మద్దూరి సునీత పోటీ చేస్తున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన మద్దూరి సునీత వార్డులోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్య సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా మెరుగుదల, డ్రైనేజీ వ్యవస్థ పటిష్టత, రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలను తన ప్రధాన అజెండాగా ప్రకటించారు. మహిళలు, యువత, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే తన లక్ష్యమని తెలిపారు. 9వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అందుబాటులో ఉండే కౌన్సిలర్‌గా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల మద్దతుతో గెలుపొందితే ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని, పేదల సంక్షేమం కోసం అంకితభావంతో పని చేస్తానని మద్దూరి సునీత పేర్కొన్నారు. కోహిర్ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా ప్రజలంతా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు
