
జనం న్యూస్ జనవరి 31.
జహీరాబాద్ నియోజకవర్గంలో సూక్ష్మ నీటి సేద్యం ద్వారా ఉద్యాన పంటలను సాగు చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల ను జిల్లా ఉద్యాన. అధికారి పి. సోమేశ్వర రావు సందర్శించి తగు సూచనలు చేశారు. ఈ సూక్ష్మ నీటి సేద్యం ద్వారా తక్కువ నీటి తో ఎక్కువ దిగుబడులు రైతులు సాధిస్తున్నారని తెలిపారు. ఈ సూక్ష్మ నీటి సేద్యం ద్వారా దీర్ఘ కాలిక పంటలు సాగు చేసుకోవచ్చని .మరియు కలుపు నివారణ కు కూడా ఈ సూక్ష్మ సేద్యం దోహద పడుతుందని తెలిపారు. సూక్ష్మ సేద్యం ద్వారా సాగు చేస్తున్న పంటలను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ క్షేత్ర స్థాయి ప్రోగ్రామ్ ఉద్యాన అధికారి మౌనిక రెడ్డి, జైన కంపెనీ ప్రతి నిధులు విజయ్, స్వామి,గొల్ల రాజా రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
