
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 31 సెల్ 9550978955
అనారోగ్య బాధితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కుల్ని ప్రత్తిపాటి లబ్ధిదారులు, వారి కుటుంబసభ్యులకు అందచేశారు. శనివారం తన నివాసంలో లబ్ధిదారులతో మాట్లాడిన ప్రత్తిపాటి.. అనంతరం వారికి నగదు చెక్కులు అందించి ప్రభుత్వం తరుపున భరోసా అందించారు మొత్తం 26 మంది లబ్ధిదారులకు రూ.16.73 లక్షల విలువైన చెక్కులను ప్రత్తిపాటి స్వయంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.