
జనం న్యూస్, ఫిబ్రవరి 01,అచ్యుతాపురం:
మాఘ పౌర్ణమి సందర్భంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సాగర తీరంలో సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు.మకర సంక్రమణం మొదలు కుంభ సంక్రమణం మధ్య కాలం మాఘమాసం. ఈ మాసంలో పుణ్యస్నానాలు ఫలప్రదమన్నది శాస్త్రవచనం. నెలంతా వీలుకాకుంటే కనీసం మాఘ పూర్ణిమ రోజైనా పవిత్ర నదులు, సముద్రంలో స్నానం ఆచరిస్తే నెలంతటి ఫలితం కలుగుతుందని ఓ నమ్మకం.అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.సముద్ర స్నానాలు చేసి పూడిమడక గ్రామంలో వేంచేసియున్న శ్రీ జగన్నాధ స్వామి,ఆంజనేయ స్వామి,గంటాలమ్మ తల్లిని భక్తులు దర్శించుకుoటున్నారు. సముద్ర స్నానాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
