
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
జాతీయ స్థాయిలో విస్డం స్కూల్ విద్యార్థుల ప్రతిభ నేషనల్ స్టూడెంట్స్ ఇన్నోవేషన్ చాలెంజ్ 2026 సీజన్ 9 భాగంగా బెంగళూరులో నిన్న నిర్వహించిన ఫైనల్స్ లో విస్డం స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని పాఠశాల కరస్పాండెంట్ వలిమి రాధా తెలిపారు పాఠశాల చెందిన విద్యార్థులు వి. మనోజ్ఞ సాయి, ఎస్. షహనాజ్ లు ఉత్తమ ప్రతిభ ప్రదర్శించారు, జాతీయస్థాయిలో 15 టీములు పాల్గొనగా వీరు ద్వితీయ స్థానం పొందారు, వీరు పర్యావరణం, ప్లాస్టిక్ రీసైకిల్ యూస్ గురించి చక్కటి ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా విస్డం స్కూల్ కరస్పాండెంట్ వలిమి రాధా విద్యార్థుల్ని అభినందించారు