
జనం న్యూస్ 02 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఈరోజు భీమిలి నియోజకవర్గం, ఎండాడ వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు జీవీఎంసీ 5, 6, 7, 8, 98 వార్డుల పార్టీ విస్తృత స్థాయి సమావేశం పోల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) హాజరయ్యారు. వారితో పాటు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబురావు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.మజ్జి శ్రీనివాసరావు ప్రసంగంలోని ముఖ్యాంశాలు: * వార్డు కమిటీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి. * కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమై, ప్రజల దృష్టిని మళ్లించేందుకు 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తోంది. * తిరుమల లడ్డూ ప్రసాదంపై లేనిపోని నిందలు వేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. కోర్టు ఆదేశించిన విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి.అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడిని నేతలు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, ఇటువంటి దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.పార్టీలోకి వలసలు:పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో జీవీఎంసీ 7వ వార్డు నుండి 15 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వీరికి చిన్న శ్రీను పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెన్నా దాసు, వార్డు అధ్యక్షులు హనుమంతు, పోతున్న ప్రసాద్, పోతున్న శ్రీను, కోలుసు ఈశ్వరరావు, మారుతి ప్రసాద్, జగ్గుబిల్లి నరేష్, పిల్లా సుజాత, రాజేశ్వరి, రజిని, అనురాధ, వరలక్ష్మి మరియు పలువురు నాయకులు, మహిళా ప్రతినిధులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.