
జనం న్యూస్ ఫిబ్రవరి 2 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి తన ఆత్మీయ మిత్రుడు వి. వెంకటపతి రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండి, మిత్రులతో కలిసి సరదాగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ “జై పురంధర్ రెడ్డి” అంటూ మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా పురంధర్ రెడ్డి తన మిత్రులతో కలిసి వెంకటపతి రాజుతో కేక్ కట్ చేయించి, శాలువాతో సన్మానించి, కేకు తినిపించారు. ఈ కార్యక్రమం స్నేహబంధానికి అద్దం పడుతూ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.ఈ వేడుకలో జి. నర్సింగ్ రావు, సూర్యనారాయణ, జి. ప్రసాద్, లక్ష్మణ్, గణేష్, సుధాకర్ రెడ్డి, రమేష్, అఖిల్, సురేష్, మురళి తదితరులు పాల్గొని వెంకటపతి రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మిత్రునికి జనంపల్లి పురంధర్ రెడ్డి పేరుపేరునా అభినందనలు తెలియజేస్తూ, వారి సహకారం, స్నేహం అమూల్యమని పేర్కొన్నారు.
