
.జనం న్యూస్ ఫిబ్రవరి 2 ముమ్మడివరం ప్రతినిధిడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం నియోజవర్గం ఈరోజు ముమ్మడివరం మీడియా సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నాలుగు దశాబ్దాలుగా సువర్ణ కాలం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల పక్షాన అంకిత భావంతో ప్రజా సంక్షేమ పాలన అందించిన రాజకీయ దురంధరుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని విమర్శించే స్థాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకి లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ ధ్వజమెత్తారు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే నీచాతి నీచమైన భావజాలం కలిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు ఓటమిపాలైన మారలేదని నారా చంద్రబాబు నాయుడు ని దుర్భాషలాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వైయస్సార్ పార్టీ సింగిల్ డిజిటల్ కే పరిమిత అవుతుందని హెచ్చరించారు జగన్ మోహన్ రెడ్డి చేసిన అవినీతిని మీరు చేసిన పాలన ప్రజలు గమనిస్తున్నారని ఇప్పటికైనా మీరు మీ తీరును మార్చుకుంటే ప్రజల కమిస్తారని, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా నోటి దురద తగ్గలేదని ఇప్పటికీ ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని తీవ్ర స్థాయిలో అశోక్ మండిపడ్డారు అచ్చోసిన అంబటి మాట్లాడిన భాష దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఒక్క ఛాన్స్ అంటూ గతంలో అధికారంలోకి వచ్చిన జగన్.,.. దాడులు దౌర్జన్యాలతోనే పాలన సాగిందన్నారు ఆయన చంద్రబాబు లాంటి రాజకీయ చరిత్ర ఎవరికీ లేదు . రాదు అన్నారు ఆయన రికార్డులను ఎవరు చెరిపేయలేనివని స్పష్టం చేశారు.