
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్
సలికినీడి నాగు ఫిబ్రవరి 2 ఉచిత మెడికల్ క్యాంపుకు గ్రామ ప్రజలతోపాటు ఆ గ్రామానికి చుట్టూ ఉన్న గ్రామాల వారు కూడా విచ్చేసి 300 పైచిలుకు పేషంట్ లు డాక్టర్ సతీష్ చంద్ర ని కలిసి వారి సమస్యలు తెలియజేయడం జరిగింది. ఈ క్యాంపులో ఉచిత రక్త పరీక్షలతో పాటు ఉచిత మందులు కూడ పంపిణీ చేయడం జరిగింది, ఎక్సరే లాంటివి అవసరమైన వారు హాస్పటల్ వద్దకు వచ్చి సంప్రదించమని తెలిపారు. డాక్టర్ సతీష్ చంద్ర గారు మాట్లాడుతూ ఈ గ్రామంలో గుదే తారకం క్లస్టర్ ఇంచార్జి వంశీ బూత్ కన్వినర్ మరియు గ్రామ పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేశారు..