
జనం న్యూస్ 03 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఈరోజు పలు నియోజకవర్గాల్లో పర్యటించి, పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల గృహాలలో జరిగిన శుభకార్యాల్లో పాల్గొన్నారు.పర్యటన వివరాలు: * భీమిలి నియోజకవర్గం: మధురవాడలోని ఎస్.ఎస్.ఆర్ కన్వెన్షన్ నందు జరిగిన కన్నం నాయుడు కుమార్తె రజస్వల శుభకార్యానికి ఆయన హాజరయ్యారు. * నెల్లిమర్ల నియోజకవర్గం: పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామంలో మహంతి వెంకట సురేష్ స్వగృహం నందు జరిగిన వారి కుమార్తె రజస్వల వేడుకలో పాల్గొన్నారు. * చీపురుపల్లి నియోజకవర్గం: గొల్లలపాలెం గ్రామంలో గొర్లె రామారావు స్వగృహాన్ని సందర్శించి, వారి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం అలజంగి గ్రామంలో భవిరి రవిశంకర్ రావు కుమార్తె రజస్వల వేడుకలోనూ పాల్గొన్నారు. * రాజాం నియోజకవర్గం: కొండపేట గ్రామంలో హ్యాపీ కొండా వేణుగోపాల్ స్వగృహం నందు జరిగిన వారి కుమార్తె రజస్వల శుభకార్యానికి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.