
జనం న్యూస్ నందలూరుకడప జిల్లా.నందలూరు మండలం
నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతి పరిధిలోని గంగమిట్ట గ్రామంలో వెలసిన మారేమ్మ దేవత ఆలయ స్థలం గత కొన్ని సంవత్సరాల నుండి అమ్మవారి జాతర జరుగు ప్రదేశం,ఈ ప్రదేశంను గతంలో సదరు వ్యక్తి ఆక్రమించి గోడ నిర్మించారు గ్రామ ప్రజల పోరాటంతో అప్పుడు అధికారులు తొలగించారు. తిరిగి ఇప్పుడు మళ్ళి ఆ ఆలయ స్థలాన్ని అక్రమించుటకు ప్రయత్నిస్తున్నారు.కాబట్టి ఈ విషయంపై దేవాలయ స్థలాన్ని అక్రమిస్తున్న సదరు వ్యక్తిపై చర్యలు తీసుకొని అక్రమంగా చెయించుకున్న డాక్యుమెంట్ రద్దు చెయ్యమని నాగిరెడ్డిపల్లె గ్రామ పెద్దలు గోపాల్, నారాయణ, రాజా నాగేశ్వరావు, అనిల్, సురేంద్ర శివ, చంద్ర, మరియుజనసేన పార్టీ నాయకుడు కొట్టే శ్రీహరి,బీ. జే. మండల అధ్యక్షుడు కోడూరు ఆదినారాయణ నందలూరు మండల MRO అమరేశ్వరి కి అర్జి అందజేయడం జరిగింది.