
జనం న్యూస్ నందలూరుకడప జిల్లా
.ఓ అంబటి రాంబాబు, నేను లాయర్‌ను ఎమ్మెల్యేను మంత్రిగా పనిచేశాను మరియు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకుంటూ కనీసం ఇంగిత జ్ఞానం లేని వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి పై నీవు మాట్లాడటం దానిని మహిళలు,తెలుగుదేశం కార్యకర్తలు, సభ్య సమాజం నిన్ను చిత్కరించుకోవడం చూసి ఏమి చేయాలో దిక్కు తెలియక, దీనికి ఏమైనా అంటే కులాన్ని ఆసరా చేసుకుని కులం పేరుతో అందరిని రెచ్చగొట్టి, నీ వ్యాఖ్యలు సమర్థించుకునే ప్రయత్నం చేయడం నీ మూర్ఖపు కుతంత్ర ఆలోచనకు ఉదాహరణ. నీ వల్ల కులానికి మంచి పేరు రావడం దేవుడెరుగు, నీ మాటలతో నీ చేష్టలతో కులానికి కీడు చేస్తూ నీ తప్పులన్నీ కులానికి అంటగట్టడం తగదు. రాజకీయ రహస్య కుతంత్ర అజెండాలతో మీరు తెలుగుదేశం పార్టీని ప్రజలలో డామేజ్ చేయాలని ప్రయత్నాలు చేసే కొద్ది మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ పార్టీని స్వయంగా మీరే పాతాళానికి తొక్కుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు కులం గుర్తుకు రాలేదా? అరెస్టు చేస్తారని భయం వేసినప్పుడు కులం గుర్తుకు వచ్చిందా! నీలాంటి నాయకులను కులాలు నెత్తిన పెట్టుకొని ఊరేగే రోజులు పోయాయని సంగతి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసులుకోవడం తెలుసుకోవాలి. లేకుంటే నీవు రాజకీయంగా సమాధి కావడం ఖాయం.