
బిచ్కుంద ఫిబ్రవరి 3 జనం న్యూస్
మారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం మన్యాపూర్ గ్రామంలో పోడు భూముల సమస్య ను పరిష్కరించాలని కోరుతూ సోమవారం గ్రామ రైతులు బిచ్కుంద తహసిల్దార్ కార్యాలయనికి చేరుకొని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గత 40 సంవత్సరాల క్రితం 2005 భూ పంపిణి చట్టంలో భాగంగా గ్రామంలో భూమి లేని నిరుపేదలకు గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని 100 మంది రైతులకు 110 ఎకరాల భూమిని లింగాపూర్ - మన్యాపూర్ గ్రామ శివారులో సర్వే నంబర్ 37 లో భూమిని కల్పిస్తూ భూమి హక్కు పత్రాలు, పట్ల పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగిందని ప్రభుత్వం కల్పించిన భూములలో తము పంటలు సాగు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని అలాంటి తమ భూములను అటవీశాఖ అధికారులు ఈ భూములన్నీ అటవీశాఖ కు చెందిన భూములని వెంటనే ఈ భూములను విడిచి పెట్టాలంటూ దౌర్జన్యంగా, అక్రమంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములపై గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ, అటవీశాఖ శాఖ అధికారులు కలిసి నాలుగు సార్లు జాయింట్,భూసర్వే పార్ట్ బి లో పెట్టడం జరిగిందని దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వం ఇచ్చిన భూములలో చిన్న కారు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని లేని పక్షంలో రైతు కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు. అటవీశాఖ అధికారులు భూమినే నమ్ముకొని తమ భూములలో పంటలు సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని లేని పక్షంలో పరిణామాలు వేరేలా ఉంటాయని అన్నారు. కార్యక్రమం లో మన్యాపూర్ గ్రామ సర్పంచ్ బలరాం, సాయిలు,జ్ఞానేశ్వర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.