
జనం న్యూస్ ఫిబ్రవరి తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ రంగాల్లో నిధుల కేటాయింపుకు లోటు లేదని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం స్థానిక నాయకులతో కలిసి కూకట్పల్లిలోని జూనియర్ మరియు డిగ్రీ కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్ వెంకటయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా ఆయన కాలేజీలో నెలకొన్న సమస్యలను రమేష్ దృష్టికి తీసుకువచ్చారు. కళాశాలలో మొత్తం 3400 మంది విద్యార్థులు చదువుతున్నారని వీరికి భవనాల కొరత తీవ్రంగా ఉందన్నారు ఎప్పుడో ఇరవై ఏళ్ల నాడు నిర్మించిన పాత భవనాలే తప్ప మళ్ళీ కొత్త భవనాలు నిర్మించలేదని దీంతో విద్యార్థులను అకామిడేట్ చేయడం ఇబ్బందికరంగా తయారైంది అన్నారు. వెంటనే స్టూడెంట్స్ అందరికీ సరిపోయిన రీతిలో కొత్త భవనాలను నిర్మించాల్సి ఉందన్నారు. దీనిపై రమేష్ సానుకూలంగా స్పందించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి నిధులు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి , తాము వేణు, సతీష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, గంధం రాజు, కృష్ణరాజు పుత్ ,మైకేల్, వినోద్, రంగమోహన్, ఫణి కుమార్, అరవింద్, గోపాల్ చౌదరి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
