
జనం న్యూస్ ఫిబ్రవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్
మండల పరిదిలోని జగ్గంపేట గ్రామంలో పంచాయతి ఆవరణలో గ్రామ సర్పంచ్ శ్రీమతి జానమొల్ల స్రవంతి రాందాస్ గౌడ్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది ఈ సమావేశంలో గ్రామంలో వున్నా సమస్యలపై చర్చలు జరిపి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు రాబోయే వేసవికాలం దృష్టిలోఉంచికొని గ్రామం లో మంచినీటి సమస్య మరియు రాంసింగ్ తండా, మంచ్య తండా మంచి నీటి సమస్య, గ్రామంలో శితిలావస్థలో వున్నా ప్రాతమిక పాఠశాల, అంగన్ వాడి కేంద్రం, గురించి గ్రామం లో నూతనంగా విద్యుత్ స్టాంబలు వైర్, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుండి నూతన పనులు చేయుట గురించి చర్చంచారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జానమొల్ల స్రవంతి రాందాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఉప సర్పంచ్ బండల్ల లింగమయ్య, మాజీ సర్పంచ్ సికింద్రాపురం పోచయ్య, వార్డ్ సభ్యులు, ఏఎన్ఎంపారమ్మ, ఎం.ఎల్.హెచ్.పి దుర్గమ్మ,అంగన్ వాడి టీచర్ షహనాజ్ బేగం,ఆశ వర్కర్ అనిత, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు