
. జనం న్యూస్ ఫిబ్రవరి 3 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ఎల్కతుర్తి మండల్ చింతలపల్లి గ్రామంలో పెద్దల పండుగ పురస్కరించుకొని, కెనడాలో ఉన్న రియాజ్దీన్, తన బావ తాజుద్దీన్ ద్వారా, 10 పేద కుటుంబాలకు, ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యం, ఐదు కిలోల మంచి నూనె, నిత్యవసర వస్తువులను అందజేశారు. ఆ కుటుంబాలు రియాజ్దీన్ కు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. వీరి పరిస్థితిని చింతలపల్లి సర్పంచి బొంకూరి రజిత రవీందర్లు తెలియజేయగా, వెంటనే స్పందించి ఇంటింటికి వెళ్లి నిత్యవసర వస్తువులను అందజేశారు. తాజుద్దీన్ వెంట మాజీ సర్పంచ్ హింగే రాజేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్ ఎండి మదర్, వార్డు సభ్యురాలు డుక్కురే సౌజన్య, లు ఉన్నారు.